కొనసాగుతున్న అతిరుద్ర హోమాలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో అతిరుద్ర మహా యజ్ఞం, హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాల్లో కూర్చునే భక్తులతో పాటు సాధారణ భక్తులకు సైతం అభిషేకం చేసే అవకాశం కల్పించడంతో వందలాదిగా వస్తున్నారు. 200 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల నడమ హోమాలు, యాగాలు కొనసాగాయి. మహా యజ్ఞాన్ని తిలకించేందుకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇసుక లారీ సీజ్
దోమ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని బుధవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం పగిడాల గ్రామం నుంచి పూడూరు మండలం బొంగుపల్లి తండాకు శ్రీనివాస్ తన లారీ లో దోమ మండలం మల్లేపల్లి తండా మీదుగా పరిగి పట్టణానికి ఇసుకను తరలిస్తున్నాడు. పక్క సమాచారంతో తమ సిబ్బందితో లారీని పట్టుకున్నట్లు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
మట్టి టిప్పర్ సీజ్
పూడూరు: అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసినట్లు చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌త్‌రెడ్డి తెలిపారు. బుధవారం మన్నేగూడ సర్కిల్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓవర్ లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అంగన్‌వాడీ
సిబ్బందిపై ఫిర్యాదు
ధారూరు: మండలంలోని కుమ్మర్‌పల్లి జీపీ పరి ధిలోని బోజ్యానాయక్‌తండా, నాగారంతండా, కుమ్మర్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రాలు ఎప్పుడూ మూతబడి ఉంటున్నాయని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ విషయమై మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవా రం కుమ్మర్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారులు అక్కడ ఆయా, టీచర్ లేకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. సెంటర్ తెరుస్తారని భావించిన ఓ తల్లి తన చిన్నారిని అక్కడే కూ ర్చోబెట్టి పొలం పనులకు వెళ్లిపోయింది. అప్ప టి వరకూ ఉన్న తోటి పిల్లలు ఇళ్లకు వెళ్లిపోవడంతో సదరు చిన్నారి అక్కడే కూర్చుని ఏడుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కుమ్మర్‌పల్లి వార్డు మెంబర్లు సిబ్బంది పనితీరుపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీడీపీఓకు విజ్ఞప్తి చేశారు. కుమ్మర్‌పల్లి అంగన్‌వాడీ టీచర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని, పంచాయతీ తరఫున ఫిర్యాదు చేశామని స్పష్టంచేశారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
యాలాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన యాలాల మండలంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ప్రతిభ పాఠశాల వెనుక కంది పంటలో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వివరాలు సేకరించారు. సుమారు 10 రోజలు క్రితం చనిపోయి ఉండొచ్చని, మృతుడు వయస్సు సుమారు 45–50 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహానికి సంబంధించిన ఓ కాలును జంతువులు పీక్కు తిని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఒంటిపై నల్లటి నైట్ ప్యాంట్, గడ్డం ఉందన్నారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే వెంటనే సెల్ నంబరు 8712670054లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
కొనసాగుతున్న అతిరుద్ర హోమాలు
కొనసాగుతున్న అతిరుద్ర హోమాలు
కొనసాగుతున్న అతిరుద్ర హోమాలు


