తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
దౌల్తాబాద్: మండలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని కడా ప్రత్యే కాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం దేవర్‌ఫసల్వాద్ గ్రామంలో రూ.27 లక్షలతో నిర్మించనున్న వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కృషితో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యలేకుండా చూస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ ర వికుమార్,డీఈ శశాంక్,ఏఈ శివసాయి తేజ, సర్పంచ్ రాజు,నాయకులు వెంకట్రావు,వీరన్న, వెంకట్రాములు,రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొడంగల్ మండలంలో..
కొడంగల్ రూరల్: మండలంలోని కస్తూర్‌పల్లిలో బుధవారం వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు అధికారులు భూమిపూజ చేశారు. 60 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్‌ను నిర్మించనున్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్‌గౌడ్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శశాంక్‌మిశ్రా, ఏఈ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి జగదీష్‌గౌడ్ పాల్గొన్నారు.
కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి


