బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం
మొయినాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని ఆ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిలు ముఠా జయసింహా, అమృత్‌లాల్ చౌహాన్ అన్నారు. బుధవారం వారు మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో వార్డు అభ్యర్థుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థు లను గెలిపించుకోవడానికి కృషి చేయాలన్నా రు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు. అభ్య ర్థుల ఎంపిక దాదాపు ఖరారైందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అంనతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యు డు కొత్త మాణిక్‌రెడ్డి, నాయకులు జయవంత్, మల్లారెడ్డి, శంకరయ్య, మాణిక్యం, రాజు, డేవిడ్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
బీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జిలు
ముఠా జయసింహా, అమృత్‌లాల్ చౌహాన్


