విద్యార్థులకు చేయూత
బషీరాబాద్: మండలంలోని నావంద్గీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంకిత ఫౌండేషన్ చేయూతనందించింది. ఫౌండేషన్ చైర్మన్, పరిగి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పెద్దరగాళ్ల చంద్రయ్య విద్యార్థులకు బ్యాగులు, ష్యూస్, చెప్పులు, మ్యాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ ఉత్తమ సేవా అవార్డు గ్రహీత యాస మల్లారెడ్డి మాట్లాడుతూ.. సొంత గ్రామం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ ప్రకాష్,, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


