పల్లెల్లో షార్ట్ ఫిల్మ్ షూటింగ్
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్లకు చెందిన ఈర్లపల్లి రమేశ్ షార్ట్ ఫిల్మ్‌లతో ఆకట్టుకుంటున్నారు. తాను నూతనంగా నిర్మిస్తున్న ఓ లఘు చిత్రంలోని పాటను సోమవారం దుద్యాల్, చౌడాపూర్ మండలాల్లోని పలు గ్రామాలతో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించారు. మారుమూల పల్లెల్లో జరిగిన షూటింగ్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
జెండావిష్కరణ వివాదాస్పదం
బషీరాబాద్: మండల పరిధి జీవన్గీ గ్రామం చావడి కార్యాలయంలో ఉప సర్పంచ్ జర్నప్ప జాతీయ జెండా ఎగురవేయడం వివాస్పదంగా మారింది. రెవెన్యూకు సంబంధించిన కార్యాలయంపై ఎప్పుడైనా జెండాను రెవెన్యూ అధికారులే ఎగురవేసేవారని, అలాంటిది బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు ఎలా చేశాడని అధికార పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఇదే విషయమై తహసీల్దార్ షాహెదాబేగంకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఉప సర్పంచ్ హోదాలో కానీ, పార్టీ నాయకుడిగా జెండా ఎగరవేయలేదని, గ్రామస్తుల సూచన మేరకే చేశానని ఉప సర్పంచ్ జర్నప్ప మీడియాకు వివరణ ఇచ్చారు.
ప్రత్యేక అలంకరణలో
కపిలేశ్వర స్మామి
ధారూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఆలయంలో కపిలేశ్వర స్మామి త్రివర్ణ పతాకం వర్ణంతో భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి చెన్నబసవయ్యస్వామి సోమవారం.. మూడు రంగులతో అలంకరించి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదం వితరణ చేశారు.
కారుతో బీభత్సం కేసులోఇద్దరికి రిమాండ్
యాచారం: మద్యం మత్తు, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్‌ఐని కారుతో ఢీకొట్టిన ఇద్దరిని యాచారం పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వివరాలిలా ఉన్నాయి. సాగర్ హైవేపై ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలో సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధులు తమ సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి కారులో ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కొహెడ్‌కు చెందిన కె.శ్రీకర్, హయత్‌నగర్‌కు చెందిన పి.నితిన్‌లు మండల కేంద్రం వద్దకు రాగానే డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి తప్పించుకునే యత్నం చేశారు. అది గమనించిన ఎస్‌ఐ మధు ఆపే ప్రయత్నం చేయగా కారును నడిపిస్తున్న శ్రీకర్ మరింత వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. కారును నిలిపే ప్రయత్నంలో ఎస్‌ఐ బానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. మరింత వేగం పెంచి మార్గమధ్యలో మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్‌రెడ్డి, ఆయన కొడల దివ్యను, ఆమె కొడుకును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో శ్రీకర్ ఉద్దేశపూర్వకంగా ఎస్‌ఐతో పాటు మరో ముగ్గురిని కారుతో ఢీకొట్టాడని కేసు నమోదు చేశారు. ఈ మేరకు శ్రీకర్, నితిన్‌లను సోమవారం రిమాండ్‌కు పంపినట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
పల్లెల్లో షార్ట్ ఫిల్మ్ షూటింగ్
పల్లెల్లో షార్ట్ ఫిల్మ్ షూటింగ్


