ట్రాక్టర్‌ బోల్తా, వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా, వ్యక్తి మృతి

Jan 27 2026 9:42 AM | Updated on Jan 27 2026 9:42 AM

ట్రాక్టర్‌ బోల్తా, వ్యక్తి మృతి

ట్రాక్టర్‌ బోల్తా, వ్యక్తి మృతి

కొడంగల్‌ రూరల్‌: పంటపొలంలో కరిగెట చేస్తున్న క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి ఉడిమేశ్వరం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అప్పాయిపల్లికి చెందిన చిన్నదస్తప్ప(36)గ్రామంలోని చంద్రమ్మ ఇంటికి ఇళ్లరికం వచ్చాడు. అంజిలప్ప దగ్గర ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సదరు వ్యక్తి.. కరిగెట కొడుతుండగా.. ట్రాక్టర్‌ బోల్తాపడి మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య శ్యామల, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతుడి అన్న శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

బస్సు ఎక్కుతుండగా

మహిళల ఘర్షణ

శంకర్‌పల్లి: బస్టాండ్‌లో మహిళల మధ్య జరిగిన గొడవ కాస్త పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లిన సంఘటన సోమవారం శంకర్‌పల్లిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెహదీపట్నానికి చెందిన ఓ యువతి(19) రెండు రోజుల క్రితం తన అమ్మమ్మ ఊరైన మండలంలోని చెందిప్ప గ్రామానికి వచ్చింది. సోమవారం తిరుగు ప్రయాణం అయ్యేందుకుగాను శంకర్‌పల్లి బస్టాండ్‌కి వచ్చింది. మెహదీపట్నం బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయత్నించగా.. ఓ కుటుంబానికి చెందిన నలుగురు మహిళలతో ఆ యువతికి ఘర్షణ తలెత్తింది. అది కాస్త పెద్దది కావడంతో నలుగురు కలిసి ఆ యువతిని కొట్టడంతో పాటు, కొద్దిమేర దుస్తులు చించినట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళలు సైతం ఆ యువతే తమని ఇబ్బందులకు గురి చేసిందంటూ ఫిర్యాదు చేశారు. ఇరువురు ఫిర్యాదులు స్వీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు.

ఓపెన్‌ వర్సిటీలో వ్యవసాయ ఆధారిత కోర్సులు

బంజారాహిల్స్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో త్వరలో వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులను ప్రారంభిస్తామని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి చెప్పారు. వర్సిటీలో సోమ వారం జరిగిన గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు, రైతులకు మేలు జరిగేలా ఈ కోర్సులను రూపొందిస్తామని తెలిపారు. మొదటి సెమిస్టర్‌ నుంచే కార్పొరేట్‌ కంపెనీలకు అవసరమ య్యే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విజయకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఆదిబట్ల ఏసీపీగా..ప్రదీప్‌కుమార్‌ బాధ్యతలు

ఇబ్రహీంపట్నం: ఆదిబట్ల ఏసీపీగా డీకే ప్రదీప్‌కుమార్‌ సోమ వారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌ను ఇటీవల హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్‌ ఏసీపీ స్థాయి హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. నూతన డివిజన్‌ కార్యాలయానికి ఏసీపీగా ప్రదీప్‌కుమార్‌ను నియమించడంతో అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో సమావేశమై ప్రజా భద్రత, నేరాలను అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు, స్నేహపూర్వక పోలీసింగ్‌ వ్యవస్థ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement