ఉత్తమ పోలీసులకు అవార్డులు
● 29 మందికి ప్రశంసా పత్రాలు
● అందజేసిన కలెక్టర్, ఎస్పీ
అనంతగిరి: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 29 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ స్నేహ్రమెహ్ర ప్రశంసా పత్రాలు అందజేశారు. ధారూరు సీఐ సీహెచ్.రఘురాములు, మోమిన్‌పేట్ ఎస్‌ఐ ఎం.అరవింద్, డీపీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు మొహమ్మద్ అయూబ్, ఎం.సాయిప్రసాద్, ఐటీ సెల్ ఎం.కేశవులు అవార్డు అందుకున్నారు. కృష్ణ(డీసీఆర్‌బీ), ఎస్.ప్రమీల, కె.మీన (డీఎస్‌బీ, టి.రామకృష్ణ (క్లూస్ టీమ్), ఎం.పార్వతీశం (పీసీఆర్), చంద్రశేఖర్(డీటీసీ) ప్రశంసా పత్రాలు అందుకున్నారు. భరోసా కేంద్రం సపోర్ట్ పర్సన్ జి.హెప్జిబా, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ వి.రమేష్ తోపాటు హెడ్ కానిస్టేబుళ్లు జమీల్(చెంగోముల్), రమేష్ వర్మ(కొడంగల్), ఎస్.గోపాల్, జహంగీర్ పాషా(పరిగి), బలరామ్(మోమిన్‌పేట్), నర్సింలు(వికారాబాద్), నరేష్(ధారూరు), జయవర్ధన్(సీసీఎస్), సాయికృష్ణ యాదవ్(తాండూరు), అశోక్ కుమార్(కరంకోట్), శ్రీనివాస్(యాలాల), కె.నాగేంద్ర (బషీరాబాద్), జగ్గమ్మ, హోంగార్డులు ఆర్.వెంకటయ్య, సత్యనారాయణ, శేఖర్,(డీఏఆర్) అవార్డులు పొందారు.
ఉత్తమ పోలీసులకు అవార్డులు


