బీఆర్‌ఎస్ మున్సిపల్ ఇన్‌చార్జ్‌ల నియామకం
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్ అధిష్టానం శనివారం పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. వికారా బాద్ మున్సిపల్ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పరిగికి పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్, తాండూరుకు శ్రీశైల్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ ఇన్‌చార్జ్‌గా గట్టు రాంచందర్‌రావును నియమించింది.
సర్పంచ్ వెంకట్ శ్రీయారెడ్డి
దోమ: మా ఊరిపేరు దొంగ ఎన్కేపల్లి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే పేరు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ డాక్టర్ వెంకట్ శ్రీయారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్‌లో డీపీఓ జయసుధను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. ఊరి పేరులో దొంగ అని ఉండటంతో విద్యావేత్తలు, విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని తెలిపారు. ఎక్కడికి వెళ్లిన తమను చిన్నచూపుతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సంజీవ స్వామి పురాతన ఆలయం ఉందని ఆ పేరున సంజీవ నగర్‌గా నామకరణం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని కోరారు. స్పందించిన డీపీఓ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్‌కుమార్, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
తాండూరు: పట్టణంలోని మాతశిశు ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా ఎల్ నయన్‌రాజ్‌ను నియమిస్తూ కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆనంద్ శనివారం నయన్‌రాజ్‌కు నియామకపత్రం అందించారు. కొడంగల్ ప్రాంతానికి చెందిన నయన్‌రాజ్ ఎంబీబీఎస్ (డీసీహెచ్) పూర్తి చేసి పట్టా అందుకున్నారు.
పరిగి: పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని అడిషనల్ ఎస్సీ రాములునాయక్ హెచ్చరించారు. శనివారం పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇటుక బట్టీల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, పరిగి, కొడంగల్ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత అన్నారు. శనివారం బాలిక దినోత్సవాన్ని పుర స్క రించుకుని వికారాబాద్ పట్టణ పరిధిలోని కొత్తగడి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయరాదన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సాయిలత తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ మున్సిపల్ ఇన్‌చార్జ్‌ల నియామకం
బీఆర్‌ఎస్ మున్సిపల్ ఇన్‌చార్జ్‌ల నియామకం


