అభివృద్ధికి అడిగినన్ని నిధులు
బంట్వారం: అభివృద్ధి పనులకు అడిగినన్ని నిధులు మంజూరు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి అన్నారు. కోట్‌పల్లి మండలం లింగంపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు నిరంతరం పాటు పడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, సర్పంచ్ చంద్రకళ, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నాయకులు జ్ఞానేశ్వర్, వెంకటేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు
యాలాల: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వస తులు ఉంటాయని, తల్లిదండ్రులు వారి పిల్లలను సర్కారు స్కూళ్లకే పంపాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పగిడియాల ఉన్నత పాఠశాలల్లో కొత్తగా నిర్మించిన స్టేజీ ప్రాంతాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, సర్పంచ్ రిశిత, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నర్సింలుగౌడ్, ఎంఈఓ రమేష్, హెచ్‌ఎం కృష్ణయ్య, ఉపాధ్యాయులు రవి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి


