టీచర్ల కొరతపై నివేదిస్తాం
బొంరాస్‌పేట: మండలంలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను ఉన్నతాకారుల దృష్టికి తీసుకెళ్తామని డీఈఓ రేణుకాదేవి తెలిపారు. శుక్రవారం బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులను జిల్లా కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. కొడంగల్ తోపాటు మొత్తం ఏడు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని డీఈఓ తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ జిల్లా కన్వీనర్ శివరాజ్, కో కన్వీనర్ నాగరాజు, పరిగి నియోజకవర్గ అధ్యక్షుడు రాములు, ఎంవీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉన్నత పాఠశాలగా మార్చాలి
ఎన్కేపల్లి యూపీఎస్‌లో ఉపాధ్యాయుల కొరతను తీర్చి, ఉన్నత పాఠశాలగా మార్చాలని గ్రామ సర్పంచు బాల్‌రాజు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు శుక్రవారం కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన వచ్చే విద్యాసంవత్సరం నాటికి నూతన పోస్టులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినధులు మణెమ్మ, కళావతి, అనంతమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రేణుకాదేవి


