చదువుతోనే సమాజంలో గుర్తింపు
పరిగి: విద్యార్థులపై తల్లిదండ్రులు సైతం శ్రద్ధ చూపాలని కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లాల్ కృష్ణ సూచించారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి అది సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. కళాశాల అభివృద్ధికి తాను ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్‌ముదిరాజ్, సీపీఎం నాయకులు వెంకటయ్య, ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, భాస్కరయోగి తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లాల్‌కృష్ణ


