ఓటు వజ్రాయుధం
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
అనంతగిరి: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధంతో సమానమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని తెలిపారు. పంచాయతీ సర్పంచ్ మొదలు ప్రసిడెంట్ వరకు ఓటు ద్వారానే ఎన్నికవుతారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్, డీఆర్‌ఓ మంగీలాల్, జిల్లా స్వీప్ అధికారి సత్తార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
అర్హులు విధిగా ఓటు హక్కు పొందాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. పోలింగ్ తోపాటు కౌంటింగ్ కోసం భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్, తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


