ఈ లైన్‌మెన్ మాకొద్దు
నవాబుపేట: ఈ లైన్‌మెన్ మాకొద్దని, వెంటనే ఆయన్ను తొలగించాలంటూ మైతాప్‌ఖాన్‌గూడ ప్రజలు గురువారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న లైన్‌మెన్ శంకర్ విద్యుత్ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామానికి రావడం లేదన్నారు. పని రాని పిల్లలను విద్యుత్ పనులకు వాడుకుంటున్నాడని తెలిపారు. గతంలో మాదిరెడ్డిపల్లిలో ఒక వ్యక్తి కరెంట్ పనులు చేస్తూ మృత్యువాత పడ్డాడని గుర్తు చేశారు. ఎప్పుడూ మద్యం మత్తులో ఉండే శంకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరా లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా లైన్‌మెన్‌స్పందించడం లేదన్నారు. ధర్నాలో మాజీ సర్పంచ్ రంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. లైన్‌మెన్ శంకర్‌పై ఇది వరకు అనేక ఫిర్యాదు వచ్చాయని.. తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తర్వలో మరో లైన్‌మెన్‌ను నియమిస్తామని చెప్పారు.


