ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలోని వెంకటరమణాకాలనీకి చెందిన మాదరి శివకుమార్(35) ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. మద్యానికి అలవాటుపడిన ఆయన తన భార్యతో గొడవ పడి బుధవారం రాత్రి ఇంట్లో నంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. సమీప రాయపోల్ రోడ్డు నల్లకంచె ఫారెస్ట్ ఏరియాలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.


