ఉపాధి సిబ్బందికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి సిబ్బందికి సన్మానం

Jan 22 2026 9:58 AM | Updated on Jan 22 2026 9:58 AM

ఉపాధి

ఉపాధి సిబ్బందికి సన్మానం

బంట్వారం: వీబీజీ–రామ్‌జీ(ఉపాధి హామీ) పథకంలో విధులు నిర్వహించే ఉద్యోగులను మండలంలోని తొర్మామిడి సర్పంచ్‌ సంజీవులు బుధవారం ఈజీఎస్‌ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. తాను 2019–21 మధ్య కాలంలో రెండేళ్ల పాటు తొర్మామిడిలో ఈజీఎస్‌ వర్కర్‌గా తాత్కాలికంగా పని చేశానన్నారు. ఈజీఎస్‌లో విధులు నిర్వహించే వారందరూ సత్వరమే స్పందించడంతోనే ఉపాధి కూలీలందరికి సకాలంలో డబ్బులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుధాకర్‌, ఈసీ శ్రీనివాస్‌, టీఏలు అశోక్‌రెడ్డి, హన్మంతు, ఎఫ్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి

చెక్కుల అందజేత

బంట్వారం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని మర్పల్లి మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం బంట్వారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నేరుగా అర్హులకే చెక్కులు అందిస్తున్నామన్నారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశం, బంట్వారం సర్పంచ్‌ మల్లేశం, తహసీల్దార్‌ విజయ్‌మార్‌, ఏఎంసీ డైరెక్టర్లు యాదగిరి, నర్సింలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలకు

స్థలమివ్వాలని వినతి

బొంరాస్‌పేట: మండల కేంద్రంలో క్రీడా మైదానానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని బుధవారం తహసీల్దార్‌ పద్మావతికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. క్రీడా మైదానం లేనందున యువకులు, క్రీడాకారులు నిరుత్సాహానికి గురైతున్నారని పేర్కొన్నారు. అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించి క్రీడా మైదానానికి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని తహసీల్దారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వీరేశం, ఉపసర్పంచ్‌ నందినినరేందర్‌సాగర్‌, యువకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఇసుక డంపింగ్‌ గుర్తింపు

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్‌లో అక్రమ ఇసుక డంపింగ్‌లను గుర్తించినట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. తాండూరు మండలం బొంకూర్‌ శివారులోని కాగ్నా నది నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు రవీందర్‌రెడ్డి, జగన్నాథ్‌లు బుధవారం రుక్మాపూర్‌ శివారులో ఇసుక డంపింగ్‌ను గుర్తించారు. విషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్తామని ఎస్‌ఐ తెలిపారు.

ఉపాధి సిబ్బందికి సన్మానం 1
1/2

ఉపాధి సిబ్బందికి సన్మానం

ఉపాధి సిబ్బందికి సన్మానం 2
2/2

ఉపాధి సిబ్బందికి సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement