విద్యార్థుల ఉన్నతికి తోడ్పడండి
తాండూరు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సూచించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్(జీటీఏ) నూతన సంవత్సర క్యాలెండర్‌తో పాటు డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే సమర్థులైన ఉపాధ్యాయులున్నారని, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. బోధనతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులను తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జీటీఏ జిల్లా అధ్యక్షుడు బందెప్ప, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రాములు, తాండూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్, ఉపాధ్యాయులు సుధీర్, శ్రీశైలం, రామకృష్ణ, సంతోష్, హరీశ్, రమేశ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు రవిగౌడ్, రవూఫ్, నయీమ్, శ్రీనివాస్, చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


