రాయితీ పరికరాలను వినియోగించుకోండి
అనంతగిరి: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై పరికరాల పంపిణీ చేశారు. దరఖాస్తు చేసుకున్న 43 మంది రైతులకు కలెక్టర్ రొటావేటర్, కల్టివేటర్, తైవాన్ ప్రేయర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తుందన్నారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం, జిల్లా ఉద్యానవన అధికారి సత్తార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, అంజయ్య, విజయ భాస్కర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్


