వైభవంగా మార్కండేయ స్వామి జయంతి
తాండూరు టౌన్: పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో మార్కండేయ మహర్షి జయంతిని బుధవారం వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పద్మశాలి కులస్తులు, మార్కండేయ నగర్ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు అభిషేకం, 9గంటలకు గీతా పారాయణం, పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికై న సద్మశాలి సర్పంచులను, రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అనంతగిరి గుట్టలో..
అనంతగిరి: వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరి గుట్టలో వెలిసిన మార్కండేయ ఆలయంలో బుధవారం మార్కండేయ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. పూజలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఊట్ల నరేందర్, సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.


