ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలి
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
యాలాల: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు సీసీపీని కోకట్, ఇందిరమ్మ కాలనీలో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించి అనుమానితుల వివరాలు సేకరించారు. తనిఖీల్లో భాగంగా ధ్రువీకరణ పత్రాలు లేని 17 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నేర నియంత్రణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సమాజంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు పంపించే ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐలు సంతోష్‌కుమార్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు విఠల్‌రెడ్డి, నుమాన్ అలీ, వినోద్ తదితరులు ఉన్నారు.


