మున్సిపల్ కమిషనర్‌గా విక్రమ్‌సింహారెడ్డి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా విక్రమ్‌సింహారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇది వరకు సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. ఇక్కడ విధులు నిర్వహించిన జాకీర్ అహ్మద్ మొయినాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా విక్రమ్‌సింహారెడ్డి మాట్లాడుతూ.. అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
తాండూరు కమిషనర్‌గా మధుసూదన్‌రెడ్డి
తాండూరు: తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న యాదగిరిని కొల్లాపూర్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పఠాన్‌చెరువు మండలం ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న మధుసూదన్‌రెడ్డి తాండూరుకు బదిలీపై వచ్చారు.
షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు నెలల పాటు నిర్వహించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ నిర్వహించే 2025–26కు గాను స్టేట్ సర్వీసెస్, కానిస్టేబుల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ తీసుకున్నవారు అనర్హులని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 8న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఎల్.వెంకటయ్య హనరరీ డైరెక్టర్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నంబర్ 94405 21419లో సంప్రదించాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. సయ్యద్ మల్కాపూర్ గ్రామానికి చెందిన రాములుస్వామితోపాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే పరిగి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేసేది బీఆర్‌ఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు రసాయన శాస్త్రంలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పీహెచ్‌డీ, ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, ఎస్‌ఎల్‌ఈటీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 24 తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


