కేంద్రంపై దండయాత్ర చేద్దాం | - | Sakshi
Sakshi News home page

కేంద్రంపై దండయాత్ర చేద్దాం

Jan 22 2026 9:57 AM | Updated on Jan 22 2026 9:57 AM

కేంద్రంపై దండయాత్ర చేద్దాం

కేంద్రంపై దండయాత్ర చేద్దాం

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

వీబీ జీ రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు రూరల్‌: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దండయాత్ర చేద్దామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పెద్దేముల్‌ మండలం కందనెల్లి గ్రామంలో సర్పంచ్‌ యాదమ్మ అధ్యక్షతన కేంద్రం తెచ్చిన వీబీ జీ రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న ప్రతి గ్రామంలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని కోరారు. ఆ ప్రతులను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి పంపుతామన్నారు. కేంద్రం తీరుతో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎలాగైతే ఉద్యమం చేశామో.. అదే స్ఫూర్తితో ఉపాధి హామీ కొత్తం చట్టం రద్దు కోసం పోరాటం చేద్దామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌, ఉప సర్పంచ్‌ వాజీద్‌ మియా, కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంజయ్య, వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌చారి, మధుసూదన్‌రెడ్డి, కిరణ్‌, శోభారాణి, రియాజ్‌, మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశం, బుజ్జమ్మ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేయడం సమంజసం కాదని వెంటనే క్షమాపణలు చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం వికారాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి స్పీకర్‌గా దళిత ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారన్నారు. స్పీకర్‌ అందరినీ సమానంగా చూస్తూ సభను సమర్థవంతంగా నడిపిస్తూ మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు చైర్మన్‌ స్థానాలను కై వసం చేసుకుంటామన్నారు. స్పీకర్‌పై కేటీఆర్‌ ఇష్టానుసారంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. సమావేశంలో యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement