‘ఆత్మ’ చైర్మన్‌గా శంకర్‌రెడ్డి
బషీరాబాద్: తాండూరు నియోజకవర్గ ఆత్మ కమిటీ(అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.శంకర్‌రెడ్డి నియమితులయ్యారు. బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్ గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డితో పాటు నియోజవకర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాల నుంచి 20 మంది సభ్యులకు కమిటీలో చోటుదక్కింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇచ్చిన సిఫారసు లేఖతో జిల్లా వ్యవసాయశాఖ ఈ మేరకు పదువులు కేటాయించింది. నేడు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖలైన హార్టికల్చర్, సెరీకల్చర్, ఇరిగేషన్, పాడిపరిశ్రమ నుంచి రైతులకు అందించే పథకాలను ఈ కమిటీలు నడిపిస్తాయి. అయితే గతంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌లో పనిచేసిన శంకర్‌రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. తనకు నామినేటెడ్ పదవి ఇచ్చిన ఎమ్మెల్యేకు శంకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ రేపు(శుక్రవారం) బషీరాబాద్ మండలం కొర్విచెడ్ సమీపంలోని గుర్రాల అనంతమ్మ ఫంక్షన్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయనుంది.
కమిటీ సభ్యులు వీరే..
జి.నర్సిరెడ్డి(జీవన్గీ), శ్యానప్ప(ఇందర్‌చెడ్), శంకర్‌నాయక్(కొత్లాపూర్), ప్రతాప్‌రెడ్డి(గంగ్వార్), పాశమొల్ల అర్జున్(ఎక్మాయి), బబల్‌రామ్(గోరేపల్లి), నాగిరెడ్డి(అగ్గనూర్), అనంతయ్య(అడల్‌పూర్), మల్లప్ప(అక్కంపల్లి), సునీల్(బషీర్‌మియాతండా), శ్యామప్ప(జినుగుర్తి), జగదీశ్(మిట్టబాస్‌పల్లి), యాదప్ప(చింతామణిమట్నం), సాయిలు(బిజ్వార్), జైపాల్‌రెడ్డి(ఐనెల్లి), శివకుమార్(జనగాం), గోపీనాయక్(మన్‌సాన్‌పల్లి), పి.శ్రీనివాస్‌రెడ్డి(బుద్దారం), చాకలి లక్ష్మణ్(గోపాల్‌పూర్), పాశాపూర్ రవి(ఆడ్కిచర్ల) ఉన్నారు.
21 మందితో తాండూరు నియోజకవర్గ కమిటీ ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయశాఖ
బషీరాబాద్ నేతకు దక్కిన నామినేటెడ్ పదవి
రేపు ప్రమాణ స్వీకారం


