గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
అనంతగిరి: గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో వేదిక, వీఐపీలు, అధికారులు కూర్చునేందుకు ఏర్పాటు చేయాలన్నారు. అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావం పెంపొందేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహమెహ్ర, ఇన్‌చార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్డీ ఓ వాసుచంద్ర, కలెక్టరేట్ ఏవో పర్హీన బేగం, వివి ధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


