మున్నూరు కాపులు రాజకీయాల్లో రాణించాలి
● 25న సర్పంచులకు ఆత్మీయ సన్మానం
● సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య
కొడంగల్: మున్నూరు కాపులు రాజకీయాల్లో రాణించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య పటేల్ అన్నారు. బుధవారం ఆయన కొడంగల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ నెల 25న సికింద్రాబాద్‌లోని శ్రీ రాజ రాజేశ్వరీ గార్డెన్‌లో సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన మున్నూరు కాపు సర్పంచులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. వారిని సన్మానించనున్నట్లు చెప్పారు. అదే రోజు సంఘం 2026 సంవత్సరం డైరీని ఆవిష్కరిస్తామన్నారు. జిల్లా, తాలూకా, మండల, గ్రామ కమిటీ సభ్యులు, కుల బంధువులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో విజయం సాధించిన వారు రావాలన్నారు. రాష్ట్ర మహాసభ ద్వారా విద్యార్థులకు కాచిగూడలో హాస్టల్ వసతి కల్పించినట్లు చెప్పారు. ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్ షిప్పులు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యువక మండలి రాష్ట్ర కార్యదర్శి శేఖర్‌రెడ్డి, కొడంగల్ కమిటీ సభ్యులు కానుకుర్తి నర్సిరెడ్డి, మున్నూరు బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.


