కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
దుద్యాల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య, కొడంగల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ అన్నారు. బుధవారం దుద్యాల్‌కు చెందిన కొప్పు సాయిలుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అర్హులైన వారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, నాయకులు ఖాజా, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


