వైభవంగా ఊరడమ్మ ఉత్సవాలు
మూడేళ్లకు ఒకసారి జాతర
● బోనమెత్తిన మంబాపూర్
● ఆకట్టుకున్న పోతురాజుల నృత్యాలు
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో మంగళవారం ఊరడమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలు, శివసస్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు కొనసాగింది. బంధువుల రాకపోకలతో ఊరంతా పండుగ వాతవారణం నెలకొంది.
వైభవంగా ఊరడమ్మ ఉత్సవాలు
వైభవంగా ఊరడమ్మ ఉత్సవాలు
వైభవంగా ఊరడమ్మ ఉత్సవాలు


