డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదకరం
తాండూరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్ ఎంతో ప్రమాదకరమని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను నిలిపి పరీక్ష చేశారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల డీఎస్పీ అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు కారాదన్నారు. అజాగ్రత్త, నిబంధనలు పాటించకపోవడం, తాగి వాహనాలు నడపడం వల్ల రోజు రోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులైతే కఠిన శిక్షలు తప్పవన్నారు. అలాగే తాగి నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అంబర్య, పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో డీఎస్పీ


