మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
● పరిగిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని పలు కాలనీలో రూ.20 కోట్ల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌లోని అన్ని వార్డుల్లో అండర్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలు, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సూచించారు. పరిగి మున్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా నాయకులు, కార్యకర్తలు చూడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


