12 నుంచి పోలేపల్లి ఎల్లమ్మ జాతర
దుద్యాల్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతర వచ్చే నెల 12 నుంచి ప్రారంభం కానుందని ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామ సర్పంచ్ చంద్రప్ప, గ్రామస్తుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మొదట వచ్చే నెల 6 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ప్రకటించినా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని వివరించారు. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతర ముఖ్య ఘట్టం సిడే లాగుట కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వ తేదీకి సవరించారు. 12న రాత్రి 9 గంటలకు గ్రామంలో ఉన్న అమ్మవారి పూర్వ ఆలయం నుంచి ప్రధాన దేవస్థానం వరకు పల్లకీ సేవ. 13న సాయంత్రం 4 గంటలకు అమ్మవారి సిడే లాగుట(ముఖ్య ఘట్టం). 14న సాయంత్రం రథోత్సవం(తేరులాగుట). 15న అమ్మవారి ప్రత్యేక పూజలు. 16న అమ్మవారిని ఉరేగింపు ప్రధాన దేవాలయం నుంచి గ్రామంలోని ఆలయానికి పంపించుట. ఇలా ఐదు రోజుల్లో బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభోవంగా సాగనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరై అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు.
ఉత్సవాల తేదీలో మార్పు చేసినట్లు ఈఓ వెల్లడి


