వసతుల్లేక.. సేవలు అందక
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో
ఇబ్బందులు పడుతున్న రోగులు
● సరిపడా సిబ్బంది, గదులు,
పరికరాలు లేని వైనం
● అన్ని చోట్ల రక్త పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు అరకొర వైద్య సేవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారు తోంది. సోమవారం సర్కారు వైద్యశాలలను ‘సాక్షి’ విజిట్ చేసింది. ఇందులో పలు అంశాలు వెలుగు చూశాయి. చాలా వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రం లేకపోవడంతో హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. చికిత్స ఆలస్యం అవుతోందని రోగులు మదన పడుతున్నారు.
అత్యవసరమైతే హైదరాబాద్‌కు
అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభం కాలేదు. దీంతో అత్యవసర సంబంధించిన కేసులు హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ మిషన్‌లు లేవు. 2డీ ఈకో–మిషన్ అందుబాటులో ఉన్నా కార్డియాలజిస్టు లేడు. నిత్యం 600లకు పైగా ఓపీ చూస్తున్నారు. వైద్యులు ఉదయం 9 గంటలకు రావాల్సి ఉన్నా అరగంట ఆలస్యంగా వస్తున్నారు. మైనర్ ఆపరేషన్‌లు మాత్రమే అవుతున్నాయి. మేజర్ సర్జరీ పరికరాలు లేవు.
పనిచేయని
టీకా స్టోరేజ్ మిషన్
ధారూరు: స్థానిక పీహెచ్‌సీలో వ్యాక్సిన్ నిల్వ చేసే మిషన్ పనిచేయడం లేదు. దీంతో వికారాబాద్ ఆస్పత్రి నుంచి తీసుకరావడం పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే విధుల నిర్వహణ ఉంటుంది. డాక్టర్ వెళ్లిపోతే సిబ్బంది ఏం చేస్తామని రోగులకు చెబుతున్నారు. పర్మినెంట్ ఫార్మాసిస్ట్ లేకపోవడంతో మందుల నిల్వకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
సీహెచ్‌సీలో డాక్టర్ల కొరత
మర్పల్లి: స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఏడుగురు డాక్టర్లు, 12 మంది నర్సలు విధులు నిర్వహించాల్సి ఉండగా ముగ్గురు వైద్యులతో సేవలందిస్తున్నారు. ఒంటి గంట వరకు ఇద్దరు డాక్టర్లు, ఫార్మసిస్టు ఓపీ చూసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఒకే డాక్టర్ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉండాల్సి వస్తోంది. అల్ట్రాసౌండ్, డయాలసిస్ సేవలు అందుబాటులో లేవు. నిత్యం 350 నుంచి 400 వరకు ఓపీ పేషంట్లు వస్తారు. అందులో 20–25 మంది అడ్మిట్ అవుతారని సిబ్బంది తెలిపారు.
వసతుల్లేక.. సేవలు అందక
వసతుల్లేక.. సేవలు అందక
వసతుల్లేక.. సేవలు అందక


