క్యాలెండర్ల ఆవిష్కరణ
అనంతగిరి: తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్, డీఆర్‌ఓ మంగీలాల్, డీఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ ఫర్వీన్ ఖాన్, టీఎన్‌జీవో నాయకులు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
గెజిటెడ్ ఉద్యోగుల సంఽఘం ఆధ్వర్యంలో ..
తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగుల సంఽఘం ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్‌కలెక్టర్ సుధీర్, జిల్లా అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తపస్ ఆధ్వర్యంలో..
అనంతగిరి: తపస్(తెలంగాణ ఉపాధ్యాయ సంఘం) ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను సోమవారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఆవిష్కరించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి, ఆనందం, లక్ష్మీకాంతరావు, కృష్ణారెడ్డి, బస్వరాజు, కృష్ణకుమార్, రాఘవేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
టీయూటీఎఫ్..
యాలాల: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) యాలాల మండల శాఖ తరఫున నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్ ప్రసాద్, దీపక్ రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, మండల ఉపాధ్యక్షుడు సంజీవ్‌కుమార్ తదితరులు ఉన్నారు.


