నలుగురు గైనకాలజిస్టులు కావాలి
గైనకాలజిస్టుల కోసం ఎదురు చూస్తున్న గర్భిణులు, బాలింతలు
తాండూరు టౌన్: పట్టణ శివారులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి(ఎంసీహెచ్) నిత్యం 140 మంది గర్భిణులు, 150 వరకు చిన్న పిల్లలు ఔట్ పేషెంట్లుగా వస్తుంటారు. సీజన్ సమయంలో చిన్న పిల్లల ఓపీ సంఖ్య 400 వరకు ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఏడుగురు చొప్పున గైనకాలజిస్టులు, పిల్లల వైద్యులు ఉన్నప్పటికీ, వచ్చే రోగుల సంఖ్యను బట్టి మరో నలుగురు అవసరముంది. అలాగే ఇతర వైద్య సిబ్బంది ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ముగ్గురు గైనకాలజిస్టులు 10.30 గంటల తర్వాత ఆస్పత్రికి వచ్చారు. దీంతో గర్భిణులు ఎదురు చూశారు.
నలుగురు గైనకాలజిస్టులు కావాలి


