వడ్డీలేని రుణాల చెక్కు అందజేత
అనంతగిరి: వికారాబాద్‌లోని సత్యభారతి గార్డెన్‌లో సోమవారం మెప్మా స్వయం సహాయక సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కును అడిషనల్ కలెక్టర్ సుధీర్ అందజేశారు. 2023–24, 2024–25 సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకున్న 317 స్వయం సంఘాలకుగాను మొత్తం రూ.95 లక్షల చెక్కును ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీఎంసీ అర్బన్ పీడీ రవికుమార్, టీఎంసీ వెంకటేష్, మెప్మా ఆర్‌పీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


