ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 80 ఫిర్యాదులు వచ్చాయి. పెన్షన్, వ్యవసాయం, గృహ నిర్మాణ శాఖ, భూ సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్పీకర్ తరఫున నగదు అందజేసిన నాయకులు
ధారూరు: మీర్జాపూర్ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందతున్న ధారూరు మండలానికి చెందిన ముగ్గురికి స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు. ఆ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు మాన్‌సింగ్, ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి సోమవారం బాధితులకు అందజేశారు. ధారూరు మండల కేంద్రానికి చెందిన నందినికి రూ.25 వేలు, కేరెళ్లి గ్రామానికి చెందిన జయసుధకు రూ.50 వేలు, కొండాఖుర్దకు చెందిన యశ్వంత్‌రెడ్డికి రూ.25 వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకుల కిరణ్‌కమార్, నాగయ్య తదితరులు పాల్గొనప్నారు.
తాండూరు టౌన్: కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో పరమ శివుడు శ్రీ రుద్ర లింగేశ్వర స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు రూరల్: ఓటరు జబితాలో అనర్హుల పేర్లు తొలగించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ బీఎల్‌ఓలకు సూచించారు. సోమవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి బోగస్ ఓటర్లను తొలగించాలన్నారు. అర్హులు మాత్రమే జాబితాలో ఉంచాలని ఆదేశించారు. ఫేక్ ఆధార్ కార్డులతో ఓటు పొందిన వారిని తక్షణమే తొలగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, ఎలక్షన్ టీటీ లలిత, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రవీణ్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు
తాండూరు: తాండూరు సబ్ డివిజన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. తొలుత తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా.. సోమవారం రూరల్ సీఐ నగేష్‌ని డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో ప్రవీణ్‌రెడ్డిని నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం రాత్రి రూరల్ సీఐగా ప్రవీణ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు


