మెనూ అమలు చేయాల్సిందే
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కొత్తగడి జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటకు ఉపయోగించే సామగ్రిని పరిశీలించారు. రోజూ మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌లో బియ్యం నాణ్యతను చెక్ చేశారు. తాజా కూరగాయలతో వంట తయారు చేయాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత? అందులో పదో తరగతి విద్యార్థులు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. సబ్జెక్టుల వారీగా సిలబస్ ఎంత మేర పూర్తయ్యిందని తెలుసుకున్నారు. రోజూ సాయంత్రం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారని అని అడిగారు. పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, ఎంఈఓ బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్
తాజా కూరగాయలతో వంటలు తయారు చేయాల ని ఆదేశం
వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు


