జాతీయ స్థాయి పోటీలకు
యాలాల విద్యార్థులు
యాలాల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 15, 16వ తేదీల్లో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో డిస్కస్ త్రోలో పాఠశాలకు చెందిన శివకుమార్, మూడు వేల మీటర్ల పరుగు పందెంలో సాయికిరణ్ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్ – 17 విభాగంలో యాలాల విద్యార్థులు స్పోర్ట్స్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడి గెలవడం అభినందనీయమన్నారు. సోమవారం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను హెచ్‌ఎం సిద్రామేశ్వర్ ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో సైతం రాణించి పాఠశాలకు పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ రాజశేఖర్, ఉపాధ్యాయులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, రవీంద్రనాథ్, అర్చన, భ్రమరాంభ, అరుణ తదితరులు పాల్గొన్నారు.


