ఎన్ని అడ్డంకులు ఎదురైనా..
అనంతగిరి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా బాలికలు ఉన్నత విద్యే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డీఆర్‌డీఓ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బాలికల విద్య కోసం ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వారు తెలిపా రు. ఆడపిల్లలకు ఉన్నత విద్య, ఆరోగ్యం, సమానత్వం, సమస్యలు తదితర అంశాల ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న యువ సమ్మేళనానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్నేహ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బాలికల సంక్షేమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అమ్మాయిలు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆడపిల్లల సమానత్వం సమితి జిల్లా అధ్యక్షులు జ్యోతి, రాష్ట్ర నాయకురాలు గాయత్రి, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, ఆశలత, దేవకుమారి, ఉమాదేవి పాల్గొన్నారు.
ఉన్నత విద్యే లక్ష్యం కావాలి
జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డీఆర్‌డీఓ శ్రీనివాస్


