ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
మద్యం వ్యాపారులు గోల్‘మాల్’
పట్టించుకోని అధికారులు
పర్మిట్ బార్లు!
మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం పెరిగిపోయింది. మరో 20 రోజుల్లో లైసెన్స్ గడువు ముగియనుండటంతో ఆదాయమే లక్ష్యంగా.. ఎకై ్సజ్ శాఖ నిబంధనలు పక్కన పెట్టారు. సిండికేట్‌గా మారి, మందు బాబుల జేబులు గుల్ల చేస్తున్నారు. పర్మిట్ రూముల్లో బార్లు తెరిచి.. ఫుల్లుగా దండుకొంటున్నారు.
తాండూరు: మద్యం వ్యాపారం జిల్లాలో ‘ఫుల్లు’గా సాగుతోంది. నిర్వాహకులంతా ఏకమై.. మద్యం ప్రియుల నుంచి డబ్బులు పిండుకుంటున్నారు. పర్మిట్ రూంలను బార్లుగా మారుస్తూ.. దండుకొంటున్నారు. ఇదే అంశమై ఎక్సైజ్ శాఖ పోలీసులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోలేని, శాఖ సుపరింటెండెంట్‌కు విన్నవించినా.. చర్యలు శూన్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బార్ నిర్వాహకుల ఆందోళన
జిల్లాలోని 20 మండలాల్లో సూమారు 59 మద్యం దుకాణాలు ఉండగా.. అందులో అధికంగా తాండూరు పట్టణంలో ఉన్నాయి. ఆలయాలు, నివాస ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో దుకాణాల వద్దే మందుబాబులు మద్యం తాగుతుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా.. వైన్ షాపుల నిర్వాహకులకు ప్రభుత్వం.. దుకాణం పక్కనే పర్మిట్ రూంలకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ రూంలను కాస్తా.. వ్యాపారులు బార్లుగా మార్చారు. ఆదాయమే లక్ష్యంగా.. మద్యం ప్రియులకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. బారులో ఏం విక్రయిస్తారో అన్నీ అందుబాటులో ఉంచారు. దీంతో బార్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనేక వ్యయప్రయాసాలకోర్చి.. బార్లు తెరిస్తే.. వైన్ నిర్వాహకుల నిర్వాకంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన చెందుతున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
బెల్టు దుకాణాలకు తరలింపు
ఈ నెలతో మద్యం పాలసీ ముగుస్తోంది. కొత్తగా దుకాణాలకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 1వ తేదీన అవి తెరచుకోనున్నాయి. పాతవారికి మరో 20 రోజుల గడువు ఉండటంతో ఆదాయం రాబట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం వ్యాపారులంతా సిండికేటుగా మారారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం ధరలు పెంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న దుకాణాలకు, గ్రామాలకు మద్యాన్ని తరలించి, బెల్టు దుకాణాలను కొనసాగిస్తున్నారు.
నిబంధనలు పట్టని వైనం
సిండికేటుగా మారి.. మందుబాబుల జేబులకు చిల్లు
బెల్టు దుకాణాలకు తరలిస్తూ.. అధిక ధరలకు విక్రయం
20 రోజుల్లో ముగియనున్న గడువు
మద్యం వ్యాపారులతో ఎకై ్సజ్ అధికారులు చేతులు కలిపారన్న ఆరోపణలు ఉన్నాయి. దుకాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉన్నా.. వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారని, అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మోసం చేస్తున్నారని మందు బాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025


