జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు
షాద్‌నగర్‌రూరల్: అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10, 11 తేదీల్లో రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌లో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు పిలుపునిచ్చా రు. పట్టణంలోని మండల పరిషత్ కార్యా లయం ఆవరణలో శనివారం సీఐటీయూ, అనుబంధ సంఘాలతో జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పది గంటల పని, రాత్రి వేళల్లో మహిళలు పని చేసే విధంగా జీవోలు తీసుకువచ్చారని విమర్శించారు. కార్మికులకు కనీస వేత న నిర్ధారణ, బోనస్ ఫార్ములా, ఓవర్ టైం అలవెన్స్, ఇన్సెంటివ్‌లను నీరుగార్చారని ఆందో ళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించే మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం జనరల్ బాడీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ కన్వీనర్‌గా రాజశేఖర్, సభ్యులుగా బాబు, రాజు, జి.రాజు, యాదయ్య, సరిత, జంగయ్య, శ్రీను, రవి, మహేశ్, మల్లేశ్, మహేశ్, లింగం, రాములు, జవహర్, ఎల్లేష్, జయమ్మ, శ్రీదేవి, రమాదేవి, శ్రీలత, సుమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


