సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు

Nov 9 2025 9:27 AM | Updated on Nov 9 2025 9:27 AM

సీఎంక

సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు

సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు ప్రజా సంక్షేమమే లక్ష్యం కోతకు గురై.. ప్రమాదాలకు చేరువై ఆటల్లో గెలుపోటములు సహజం మృతులకు నివాళి

అనంతగిరి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌.. నగరంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పరిగి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనతి కాలంలోనే నెరవేర్చారని డీసీసీ ఉపాధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రకన్వీనర్‌ లాల్‌కృష్ణ అన్నారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారాని తెలిపారు. సీఎం జన్మదినం సందర్భంగా శనివారం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డినివాసంలో కేక్‌ కట్‌చేసి, సంబురాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌,కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు రామకృష్ణరెడ్డి, జగన్‌ పాల్గొన్నారు.

దోమ: విస్తారంగా కురిసిన వర్షాలతో బీటీరోడ్లు రూపం కోల్పోయాయి. కంకర తేలి,గుంతలు ఏర్పడి అధ్వానంగా మారాయి. కోతకు గురై.. వాహనదారులకు దడపుట్టిస్తున్నాయి. ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దోమ మండలం గొడుగోనిపల్లి సమీపంలో పరిగి– మహబూబ్‌నగర్‌ రోడ్డు సైడ్లు పూర్తిగా కోతకు గురైంది. ఇది జరిగి నెల రోజులు అయినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు పేర్కొంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నాసంబంధిత అధికారులు స్పందించి, ప్రమాదం జరగకముందే రోడ్డుకు మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.

అనంతగిరి: క్రీడల్లో గెలుపోటములు సహజమని డీసీఓ సాయిలత అన్నారు. ఆటలతో స్నేహభావం పెంపొందుతుందని చెప్పారు. వికారాబాద్‌ అనంతగిరిపల్లి సమీపంలోనిసాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో కొనసాగిన 1వ జోనల్‌ స్పోర్ట్స్‌మీట్‌ శనివారంతో ముగిశాయి. ఆయా విభాగాల్లో విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చదువుతో పాటు ఆటలు ముఖ్యమేనని పేర్కొన్నారు. ఓటమి గెలుపునకు నాంది అని, క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పరిగి: బస్సు ప్రమాదంలో మృతులకు.. శనివారం పట్టణ కేంద్రంలోని కొడంగల్‌ కూడలిలో రెడ్డిసంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చేవెళ్ల బస్సు ప్రమాదం దేశం మొత్తాన్ని కలచివేసిందన్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు 
1
1/2

సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు

సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు 
2
2/2

సీఎంకు.. స్పీకర్‌జన్మదిన శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement