కేంద్ర పథకాలను వినియోగించుకోవాలి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలను మత్స్యకార సంఘాలు వినియోగించుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో శనివారం జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మత్స్యకారులు చేపలు పట్టేందుకు పడవలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్సకార సంఘాలు గతంలో లాభాల్లో ఉండేవని.. ప్రస్తుతం చేపపిల్లల ఉత్పత్తి లేక ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి పెంచడంతో ఆర్థిక భారం పెరిగిందన్నారు. రాష్ట్రంలోనూ చేపపిల్లల ఉత్పత్తికి ప్రభు త్వం కృషి చేయాలన్నారు. మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకోవాలన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకుడు గున్నా ల గోపాల్‌రెడ్డి, మత్స్యసహకార సంఘం నాయకు లు శ్రీరాములు, గరుగు రాజు, నాయకులు వైభవ్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాజు పాల్గొన్నారు.


