బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలి
చేవెళ్ల: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని ఆమె నివాసంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పి.ప్రభాకర్ ఆధ్వర్యంలో రావుపల్లికి చెందిన పీఏసీఎస్ ముడిమ్యాల డైరెక్టర్ కేసారం నరేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కటికె నర్సింగ్ రావు, మధు, లక్ష్మణ్‌కుమార్, బుర్ల మల్లేశ్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సబితారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని గ్రామాల్లో పార్టీ సత్తాను చాటేందుకు కృషి చేయాలని తెలిపారు. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారిని ఆహ్వానించి కలిసిమెలిసి పార్టీకోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో విసుగొంది బీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్నారన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ మాధవరెడ్డి, ముడిమ్యాల మాజీ సర్పంచ్ స్వర్ణలతదర్శన్, మాజీ ఉప సర్పంచ్‌లు శ్రీనివాస్, మాధవరెడ్డి, నాయకులు శ్రీనివాస్, మధుసుధన్‌గౌడ్, రాము, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి


