జాతరకు రండి
స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ఆహ్వానం
అనంతగిరి: అనంతగిరి గుట్ట పెద్ద జాతరకు రావాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ఆలయం తరఫున ఆహ్వానం అందింది. గురువారం నుంచి జాతర ప్రారంభం కానుండటంతో బుధవారం హైదరాబాద్‌లో స్పీకర్‌ను ఆలయ ట్రస్టీ చైర్మన్ పద్మనాభం, ఈవో నరేందర్ కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ధారూరు: రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్.. ధారూరు వాసి మహ్మద్ కమరుద్దీన్(72) అనారోగ్యంతో బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో పదోన్నతి పొంది రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఇంజనీయర్ ఇన్ చీఫ్‌గా పనిచేసి ఉద్యోగ వివరమణ పొందారు. 2018లో అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా మూడేళ్ల పాటు కొనసాగారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస వదిలాడు. గురువారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతగిరి/కొడంగల్: కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారికి బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ తన కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ
అనంతగిరి: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా తక్షణం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ కృష్ణ బుధవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రివ్యూ పిటిషన్ వేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీంతో బీసీల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీకి బీసీల బాధలు వివరించాలని సూచించారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అక్బర్
అనంతగిరి: రాష్ట్ర వ్యాప్తంగా నేడు(గురువారం) చేపట్టనున్న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని తెలిపారు.
ఆమనగల్లు: ధ్యానంతో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ఆనందమయ జీవితం గడపవచ్చని హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, శ్రీరామచంద్ర మిషన్ శిక్షకులు నాగరాజు, విజయతులసి, సంధ్యారాణి, సుందరి, సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణ లో బుధవారం ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి ధ్యానంపై ఉచిత శిక్షణ అందించా రు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ.. ధ్యానంతో సంపూర్ణజీవితం ఆనందంగా గడపవచ్చని చెప్పారు. మానసిక ఒత్తిడి జయించే ధ్యాన పద్ధతులను వివరించారు.
జాతరకు రండి


