భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణం వేగవంతం
మీర్‌పేట: భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్ తెలిపారు. మంగళవారం రాత్రి మీర్‌పేట నందిహిల్స్ శివపార్వతి స్టీల్ ట్రేడర్స్ డీలర్ దుకాణంలో తాపీ మేసీ్త్రలు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న సంస్థ.. అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ తెలంగాణలో ప్రవేశ పెట్టిందని తెలిపారు. స్లాబులు, పిల్లర్లు, వంతెనలు, రహదారులకు ఇది సరైన ఎంపికన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేయడంతో పాటు స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన సంస్థ ఇంజినీర్లు.. సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని చెప్పారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌కు రూ.20 అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. డీలర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. సంస్థ సర్వీస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నారు. అనంతరం బిల్డర్లకు రూ.1 లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు.


