ఆశలు ఆవిరి.. భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతింట
అనంతగిరి: మోంథా తుపాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు. పోలీసు, రెవెన్యూ, వి ద్యుత్, ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితు ల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారం తీసుకోవాలన్నారు. కాజ్‌వేలు, కల్వర్టు లు, చెరువు అలుగుల వద్ద భద్రతా ఏర్పాట్లు చే యాలని తెలిపారు. ప్రజలు ఇళ్లలో ఉండటమే మంచిదన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. విద్యు త్ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. పత్తి, వరి, ఇతర పంటలు దెబ్బతినకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


