ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా..
● పదో తరగతి విద్యార్థుల కోసంఅభ్యసన దీపికల తయారీ
● త్వరలో పంపిణీ చేయనున్న విద్యాశాఖ
దోమ: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రోజూ ప్రత్యేక తరగతలు నిర్వహిస్తుండ గా, తాజాగా విద్యార్థులకు అభ్యసన దీపికలు అందజేసేందుకు సిద్ధమైంది. వీటి ద్వారా అర్థ మయ్యేలా బోధన చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే మంచి మార్కులు సాధించేలా ప్రణాళికలు చేసింది.
ఎస్‌సీఈఆర్టీ ద్వారా..
గత విద్యా సంవత్సరం మండలానికి చెందిన 346 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 494 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మండలంలో పది జిల్లా పరిషత్, ఒక కేజీబీవీ ఉంది. ఈ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో ఎస్‌సీఈఆర్టీ వారు ఒక్కో విద్యార్థికి గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రలకు సంబంధించిన అభ్యసన దీపికలు అందించారు. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. అయితే భాష సబ్జెక్టుల అభ్యాస దీపికలు అందలేదు. దీంతో వీటిలో విద్యార్థులు పట్టు సాధించకపోతే ఫలితాలపై ప్రభావం పడుతుందని గుర్తించిన విద్యాశాఖ తెలుగు, హిందీ సబ్జెక్టుల ప్రత్యేక దీపికలను నిపుణులైన ఉపాధ్యాయులతో సిద్ధం చేయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
సరళ పద్ధతిలో నేర్చుకునేలా..
ఒక్కో దీపిక 50 నుంచి 60 పేజీలతో లఘు, వ్యాసరూప, బహుళ ఐచ్చిన ప్రశ్నలకు జవాబులతో రూపొందించారు. ప్రతి విద్యార్థీ సరళ పద్ధతిలో సులభంగా నేర్చుకులా, వార్షిక పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? ఎలా రాయా లి అనే విషయాలు పుస్తకాల్లో ఉంటాయి. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సా ధించడం ఎలా అనే అంశాలను పొందుపర్చి నట్లు విద్యాశాఖ చెబుతోంది. సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలల విద్యార్థులు సైతం సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టారు.
బోధనను సులభతరం చేసేందుకు జీవ శాస్త్ర దీపికను తయారు చేశా. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. పట్టుదలతో చదివితే మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. – శాంతుకుమార్,
ఉపాధ్యాయుడు, దాదాపూర్ పాఠశాల
పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే అభ్య్యస దీపిక లక్ష్యం. సుల భ పద్ధతిలో చదువుకోవడానికి వీటుగా ఉంటుంది. సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నాం.
– వెంకట్, ఎంఈఓ, దోమ


