
కేజీబీవీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
ధారూరు: డ్రగ్స్, మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై ధారూరు కేజీబీవీ విద్యార్థులకు శనివారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మహిళ, శిశుసంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికార కేంద్రం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో పాల్గొని సత్తాచాటిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత నిపుణులు రాందాస్, సఖీ సెంటర్ ఇంచార్జి రేష్మా, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
పురుగుల బియ్యాన్ని ఎలా తింటారు?
తాండూరు రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గాజీపూర్ మాజీ సర్పంచు తలారి వీరప్ప ఆరోపించారు. శనివారం గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద పంపిణీ చేసిన బియ్యంలో పురుగులు ఉన్నాయని, ఉల్లెడ పట్టిన బియ్యాన్ని ప్రజలు ఎలా తినాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికై నా నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోతే ఆందోళన తప్పదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు ముస్తాఫా, లాలు, అంజి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ సైన్స్‌లో ఐశ్వర్యకు గోల్డ్ మెడల్
కొడంగల్: బీఎస్సీ ఫుడ్ సైన్స్‌లో ప్రతిభ కనబర్చిన పట్టణానికి చెందిన బాకారం ఐశ్వర్య శనివారం హైదరాబాద్‌లో గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్శిటీ (కోటీ ఉమెన్స్ కాలేజీ)లో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ తీసుకున్నారు.
నీటి సంపులో పడి బాలుడి మృతి
యాలాల: పొట్టకూటి కో సం వలస వెళ్లిన కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. అనుకోకుండా జరిగిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు నీటి మునిగి మృతి చెందడంతో మండలంలోని దేవనూరు గ్రామం శోకసంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన పరమేశ్వర్ భార్య ఇద్దరు కొడుకులతో కలిసి 8 నెలల క్రితం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ప్రాంతానికి వలస వెళ్లాడు. అక్కడ డెలవరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ఆయన రెండో కుమారుడు నిఖిల్ తేజ్(4) స్థానిక అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లేవాడు. శుక్రవారం సాయంత్రమైన చిన్నారి ఇంటికి రాకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రంలో వాకబు చేశాడు. పిల్లలు అప్పుడే వెళ్లిపోయారని తెలపడంతో చుట్టుపక్కల వెతకగా, స్థానికంగా ఉన్న ఓ నీటి సంపులో విగతజీవిగా నిఖిల్ తేజ్ కనిపించాడు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి అకాల మరణంతో స్వగ్రామమైన దేవనూరులో శోకసంద్రంలో మునిగింది.
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
షాద్‌నగర్: భూమిని కౌలు కు తీసుకొని అక్రమంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని శనివారం కేశంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నరహ రి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూరు గోదావరికి చెందిన కొప్పర్తి శ్రీను కొంత కాలం క్రితం కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి వచ్చాడు. గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో గుట్టుగా గంజాయి మొక్కలను సాగు చేశాడు. సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం తనిఖీ చేసి గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ మేరకు కొప్పర్తి శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కేజీబీవీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

కేజీబీవీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

కేజీబీవీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

కేజీబీవీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు