
విధులు ముగించుకొని వెళ్తుండగా..
కుల్కచర్ల: బతుకుదెరువు కోసం నగరానికి వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సత్యమ్మ మల్లయ్యల కుమారుడైన శివ(21) శంషాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో విధులు నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున అతడు విధులు ముగించుకొని రూమ్‌కి వెళుతున్నాడు. మార్గమధ్యలో శంషాబాద్‌లో బైక్‌పై యూటర్న్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే యువకుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలో వెలుగులు నింపుతాడుకున్న కుమారుడు ఇలా తిరిగిరాని లోకాలకు చేరడంతో కుటుంబీకులు తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం