
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
నవాబుపేట: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు పొందవచ్చని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా శనగ, కుసుమ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన విత్తనాలే కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఏడీఏ వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ రామ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఏవోలు జ్యోతి, ప్రసన్న లక్ష్మి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య