వేట.. తూటా ! | - | Sakshi
Sakshi News home page

వేట.. తూటా !

Oct 16 2025 8:13 AM | Updated on Oct 16 2025 8:13 AM

వేట..

వేట.. తూటా !

గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

విచారణ చేపట్టాం

గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

వన్య ప్రాణులపై వేటగాళ్ల గురి

యాలాల: మండలంలోని బాణాపూర్‌, అడాల్‌పూర్‌ పరిధిలోని రిజర్వ్‌ ఫారెస్టులో వన్య ప్రాణుల వేట సాగుతోంది. మంగళవారం బాణాపూర్‌ శివారులో ఓ వ్యక్తి కరెంటు షాక్‌తో మృతి చెందగా అతని వద్ద నాటు తుపాకీ లభించింది. దీంతో వేటగాళ్ల సంచారం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఇదే ప్రాంతంలో బుల్లెట్‌ మ్యాగ్జిన్‌, తపంచా లభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా నాటుతుపాకీ లభించడంతో ఆందోళన కలిగిస్తోంది. వన్య ప్రాణుల వేట జరుగుతుందనే దానికి బలం చేకూర్చుతోంది.

వారాంతపు సెలవుల్లో..

బాణాపూర్‌, అడాల్‌పూర్‌ పరిధిలో భారీగా రిజర్వ్‌ ఫారెస్టు ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా దుప్పిలు, అడవి పందులు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలు, అటవీ పిల్లులు(జంగ పిల్లి) ఉన్నాయి. వారాంతపు రోజులతో పాటు వరుసగా వచ్చే సెలవు రోజుల్లో వేటగాళ్లు వేటకు వస్తుంటారు. తాండూరుతో పాటు హైదరాబాద్‌, వికారాబాద్‌ లాంటి ప్రాంతాల నుంచి అపరిచిత వ్యక్తులు వస్తుంటారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో స్థానికుల సాయంతో వన్య ప్రాణులను వేటాడుతున్నట్లు తెలిసింది. కొందరూ సరదా కోసం వస్తుండగా.. మరికొందరూ వన్య ప్రాణుల మాంసం విక్రయించడానికి వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం.

తరచూ లభిస్తున్న ఆయుధాలు

2018లో అడాల్‌పూర్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పశువుల కాపరికి బుల్లెట్‌ మ్యాగ్జిన్‌ లభించగా, అదే ఏడాది ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు తపంచా దొరకడం చర్చనీయాంశంగా మారింది. అటవీ ప్రాంతంలో వేట కోసం వచ్చిన వారు ప్రమాదవశాత్తు ఆయుధాలు పొగొట్టుకున్నట్లు తెలిసింది. తాజాగా మంగళవారం లభించిన నాటుతుపాకీతో ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా వేట సాగుతుందనే ప్రచారం జరుగుతోంది.

పొలాలకు కరెంటు తీగలు

పంటలను రక్షించుకునేందుకు అటవీ ప్రాంతంలో పట్టా భూములతో పాటు పోడుభూములు కలిగిన రైతులు పొలాల చుట్టూ తీగను ఏర్పాటు చేసి కరెంటు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సార్లు వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు ఇటువంటి తీగకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అటు వేటగాళ్లతో పాటు అటవీ ప్రాంతంలో బీట్లకు తిరిగే ఫారెస్టు అధికారులకు ఈ ముప్పు పొంచి ఉంది. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తాజాగా లభించిన నాటు తుపాకీ

గతంలో బాణాపూర్‌ అటవీ ప్రాంతంలో లభించిన బుల్లెట్‌ మ్యాగ్జిన్‌, తపంచా

తాజాగా ఇదే గ్రామ శివారులో మృతి చెందిన వ్యక్తి వద్ద నాటు తుపాకీ

ఆందోళన రేపుతున్న ఘటనలు

అడాల్‌పూర్‌, బాణాపూర్‌ ఫారెస్టు ఏరియాల్లో ఏడాది కాలంగా వేట పట్ల కఠినంగా ఉంటున్నాం. ఈ విషయమై ఇటీవల బాణాపూర్‌లో జిల్లా అధికారితో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. అయినా అన్నసాగర్‌ వాసి వద్ద నాటు తుపాకీ లభించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. యాలాల పోలీసుల సహకారంతో అనుమానితుల వద్ద ఆయుధాలు ఉంటే, వారి విషయంలో కఠినంగా వ్యవహించేలా ముందుకెళ్తాం.

– రాజేందర్‌, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌

వేట.. తూటా !1
1/2

వేట.. తూటా !

వేట.. తూటా !2
2/2

వేట.. తూటా !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement